వార్తలకు తిరిగి వెళ్లండి

మహానందిలో జరిగిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో పలు అపశృతులు చోటుచేసుకున్నట్లు ఎస్సై రామ్మోహన్ రెడ్డి తెలిపారు. బుక్కాపురం గ్రామం వద్ద బీరు బాటిళ్లతో దాడి చేసుకోవడంతో పవన్ కుమార్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు.
అల్లినగరం గ్రామం వద్ద రంగు చల్లుకోవడంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పుట్టుపల్లె గ్రామం వద్ద మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మరో వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Loading comments...

