వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. భారీ జాతీయ జెండాతో చేపట్టిన ర్యాలీ ఆకట్టుకుంది.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనూర్రావు, జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మాట్లాడుతూ యువతలో దేశభక్తి, దేశ ఐక్యత భావాలను పెంపొందించేందుకే యాత్ర నిర్వహించినట్లు తెలిపారు. జాతీయ జెండా గౌరవాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

