వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి పట్టణంలోని 8వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రితో కలిసి సోమవారం భూమిపూజ చేశారు.
డ్రైనేజీ నిర్మాణంతో మురుగునీటి సమస్య పరిష్కారమై ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని ఎమ్మెల్యే తెలిపారు. పెండింగ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్ దీకొండ మానస, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

