వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖపట్నం నుంచి విజయనగరం మీదుగా పార్వతీపురం వరకు పండుగ సమయాల్లో మాత్రమే నడుపుతున్న మెమూ రైలును రాయగడ వరకు ప్రతిరోజూ నడపాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి కోరారు. కొమరాడలో ప్రయాణికులతో కలిసి ఆయన మాట్లాడారు.
విద్య, వైద్య, వ్యాపార అవసరాల కోసం ప్రయాణించే పేదలకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దీనిపై రైల్వే అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

