Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి కోసమే రేవంత్‌ను కలిశా: పోచారం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 11, 2026 6:22 PM కామరెడ్డిGeneral
అభివృద్ధి కోసమే రేవంత్‌ను కలిశా: పోచారం - Udayam
నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా సగం నిధులే వచ్చాయని అన్నారు. బీర్కూరులో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారని తెలిపారు. కేసీఆర్‌ హయాంలోనే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...