Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై జగ్గారెడ్డి ఆగ్రహం

Follow Udayam on Google
Suman Jun 11, 2026 6:50 PM హైదరాబాద్General
మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై జగ్గారెడ్డి ఆగ్రహం - Udayam
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు మెజారిటీ రాకుండా ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ప్రైవేట్ కేసును సాకుగా చూపి ఆమె నామినేషన్‌ను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. బీజేపీ దేశంలో దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, రాహుల్ గాంధీ ధర్మరాజులాంటి వారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...