వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. గతంలో 174 పోస్టులు భర్తీ చేయగా, తాజాగా మిగిలిన 30 విభాగాల్లోని 433 పోస్టుల ప్రక్రియను పూర్తి చేశారు.
ఎంపికైన అభ్యర్థులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందనలు తెలిపారు. త్వరలోనే వీరికి నియామక పత్రాలు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

