వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం పారిశుద్ధ్య కార్మికురాలు నర్సమ్మ సెలవు కోరగా, కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆమెకు సంబంధించిన కారణాన్ని తెలుసుకున్నారు. ఆమె 12 రోజుల మనవరాలు గుండె సమస్యతో బాధపడుతోందని తెలిసి చికిత్సకు చొరవ తీసుకున్నారు.
రూ.14 లక్షల చికిత్సకు ప్రభుత్వం, హృదయ సంస్థ ద్వారా నిధులు సమకూర్చారు. గత నెల 28న చిన్నారికి గుండె ఆపరేషన్ విజయవంతమైంది. కోలుకున్న పాపకు కమిషనర్ జస్వికశ్రీగా నామకరణం చేశారు.
Comments
Loading comments...

