వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెన్యువల్ కాని మూడు A4 మద్యం షాపులకు లాటరీ నిర్వహించనున్నట్లు ఆదివారం ఎక్సైజ్ సీఐ కె. కృష్ణారావు తెలిపారు. పాతపట్నంలో SKL/92, సారవకోటలో SKL/94, SKL/95 షాపులు ఉన్నాయన్నారు.
ఒక్కో దరఖాస్తుకు రూ.3.01 లక్షల ఫీజు చెల్లించాలని, 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 5న శ్రీకాకుళంలో కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహిస్తామని సీఐ తెలిపారు.
Comments
Loading comments...

