Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం అమ్మితే రూ.50వేల జరిమానా

Follow Udayam on Google
Saychi kumar Aug 22, 2026 11:13 AM కామరెడ్డిGeneral
మద్యం అమ్మితే రూ.50వేల జరిమానా - Udayam
పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామం శ్రీకారం చుట్టింది. సర్పంచ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో శనివారం గ్రామ పెద్దలు సమావేశమై గ్రామంలో మద్యం విక్రయించవద్దని ఏకగ్రీవంగా నిర్ణయించారు. నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మితే రూ.50 వేల జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే అక్రమ విక్రయాలపై సమాచారం అందించిన వారికి రూ.5 వేల బహుమానం అందజేస్తామని ప్రకటించారు. గ్రామస్థుల నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...