Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యాహ్నం తరువాత పాఠశాలలో ఒకరే టీచర్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 8:46 AM వికారాబాద్General
మధ్యాహ్నం తరువాత పాఠశాలలో ఒకరే టీచర్ - Udayam
పెద్దేముల్ మండల పరిధిలోని తట్టేపల్లి MPPS ప్రభుత్వ పాఠశాలలో గురువారం మ. 2 తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టారని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో సుమారు 90 మంది విద్యార్థులు ఉండగా గురువారం మధ్యాహ్నం మహబూబ్ అనే ఉపాధ్యాయుడు ఒక్కరే పాఠశాలను మేనేజ్ చేశారు. పాఠశాలలో పాఠాలు నేర్పే గురువులు లేకపోవడంతో విద్యార్థులు బడి బయట ఆటలాడుతూ కనిపించారని చెబుతున్నారు.ఈ విషయం ఆలస్యంగా రావడం గమనార్హం.

Comments

G
Loading comments...