వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ మండలంలోని మచ్కల్ గ్రామంలో మహిళా సమైక్య భవనాన్ని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ శనివారం ప్రారంభించారు. మహిళలకు ప్రత్యేక భవనం అందుబాటులోకి రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం స్థానిక పాఠశాలలో రూ.9 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడకు ఆయన భూమిపూజ చేసి, విద్యార్థుల సాంస్కృతిక ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కళావేదికను ఎమ్మెల్యే ప్రారంభించారు.
Comments
Loading comments...

