Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత

Follow Udayam on Google
p.g.murthy Aug 24, 2026 3:10 PM మంచిర్యాలGeneral
మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత - Udayam
గ్రామాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం లక్షెట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం నుండి దౌడేపల్లి గ్రామం వరకు రూ.2.89 కోట్లతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచులు, నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...