వార్తలకు తిరిగి వెళ్లండి
గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం

గుజరాత్‌లోని రామోల్ ప్రాంతంలో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 10 మంది దుర్మరణం పాలయ్యారు. లైసెన్స్ లేకపోవడంతో అధికారులు గతంలోనే ఈ ఫ్యాక్టరీని సీజ్ చేశారని పోలీసులు పేర్కొన్నారు.
అయితే నిర్వాహకులు అక్రమంగా కేంద్రాన్ని తెరిచి బాణాసంచా తయారు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...