వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్(టి) మండలంలో కట్న వేధింపుల ఆరోపణలతో పురుగుమందు తాగిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందింది. లక్ష్మీపూర్‌కు చెందిన సరోజకు 18 నెలల క్రితం వివాహం కాగా, అదనపు కట్నం కోసం భర్త, కుటుంబ సభ్యులు వేధించారని ఆమె కుటుంబీకులు ఆరోపించారు.
మంచిర్యాలలో చికిత్స పొందుతున్న సరోజ శుక్రవారం మృతిచెందింది. ఘటనపై భర్త సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

