వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ రూరల్ మండలం నల్లగుంటపల్లిలో వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. అట్ల అనిత (24) కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏడాది క్రితం భర్తతో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్ద ఉంటున్న ఆమె బుధవారం రాత్రి వ్యవసాయ బావిలో దూకినట్లు వెల్లడించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

