Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనుబోలు ఎస్సై అరాచకాలపై ఆగ్రహం

మానస శర్మ Jul 16, 2026 6:44 AM నెల్లూరు 4 viewsabout 3 hours ago
మనుబోలు ఎస్సై అరాచకాలపై ఆగ్రహం - Udayam Digital
నెల్లూరు జిల్లా మనుబోలు ఎస్సై ఎస్‌కే హనీఫ్ వ్యవహారశైలిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు, అమాయకులను ఠాణాలో చచ్చేలా కొడుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఈయన పొదలకూరులో ఓ రైతును చితకబాది, ఆ దృశ్యాలను టీడీపీ నేతలకు లైవ్ వీడియోలో చూపించడం సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై వైఎస్సార్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆందోళన చేపట్టడంతో విచారణ జరిపి, ఈ నెల 6వ తేదీన ఎస్సైని మనుబోలుకు బదిలీ చేశారు.

Comments

G
Loading comments...