వార్తలకు తిరిగి వెళ్లండి

కానూరు న్యూ ఆటోనగర్‌లోని శ్రీ విజయ దుర్గ ఫ్రోజెన్ ఫుడ్స్ సంస్థలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పగా, సుమారు రూ.90 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

