Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 13, 2026 11:49 AM ప్రకాశం General
ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం - Udayam
ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తోంది. పంట సాగుకు అనుకూలంగా ఉన్న 16 మండలాలను అధికారులు గుర్తించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. హెక్టారుకు 143 ఉచిత మొక్కలతో పాటు అంతర పంటల సాగుకు నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తారు. డ్రిప్ పరికరాలపై 90 శాతం రాయితీ ఇస్తున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి గోపీచంద్ తెలిపారు.

Comments

G
Loading comments...