Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్ బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు

Follow Udayam on Google
B RAJESH Sep 20, 2026 10:57 AM విజయనగరంGeneral
మైనర్ బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు - Udayam
మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లిన ఘటనపై సంతకవిటి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఈనెల 1న ఇంట్లో ఎవరూ లేనప్పుడు బొబ్బిలికి తీసుకెళ్లినట్లు తల్లి ఫిర్యాదు చేసింది. గతంలోనూ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ గోపాలరావు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...