Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహంకాళీ అమ్మవారికి తహసీల్దార్‌ బోనం

Follow Udayam on Google
మానస శర్మ Aug 04, 2026 2:35 PM సంగారెడ్డిGeneral
మహంకాళీ అమ్మవారికి తహసీల్దార్‌ బోనం - Udayam
సంగారెడ్డి జిల్లా హత్నూర మండల తహసీల్దార్‌ ఫర్హీన్‌షేక్‌ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళీ అమ్మవారికి బోనం సమర్పించి మతసామరస్యాన్ని చాటారు. సంప్రదాయబద్ధంగా బోనం కుండతో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఎనిమిదేళ్లుగా తాను అమ్మవారికి బోనం సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...