Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె: ఏసీబీ సోదాల్లో రూ.82,865 పట్టుబాటు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 8:42 AM అన్నమయ్యGeneral
మదనపల్లె: ఏసీబీ సోదాల్లో రూ.82,865 పట్టుబాటు - Udayam
మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాల్లో ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద రూ.82,865 లంచం నగదు పట్టుబడినట్లు కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు. సోమవారం జరిగిన దాడుల్లో తొలిరోజు రూ.1.25 లక్షలు స్వాధీనం చేసుకుని రికార్డులతో సరిపోల్చారు. అందులో రూ.45 వేల ప్రభుత్వ నగదు కాగా, మిగిలిన రూ.82,865 ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద లంచంగా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...