వార్తలకు తిరిగి వెళ్లండి

పినపాక మండల నిరుద్యోగ యువతీ యువకులకు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ, వసతి కల్పించనున్నట్లు ఏడుళ్ల బయ్యారం ఎస్సై సురేష్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 30న సాయంత్రం 5 గంటల్లోపు పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సెప్టెంబర్ 6న మణుగూరులో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత సాధించిన వారికి ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

