Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మావో స్ఫూర్తితో ఉద్యమాలు నిర్మించాలి: జనార్దన్

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 12:29 PM యాదాద్రి భువనగిరిGeneral
మావో స్ఫూర్తితో ఉద్యమాలు నిర్మించాలి: జనార్దన్ - Udayam
సామ్రాజ్యవాద దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్‌ మావో అని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జనార్దన్‌ అన్నారు. మావో వర్ధంతి సందర్భంగా యాసోజిగూడెంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. మావో స్ఫూర్తితో ప్రజా, కార్మిక, రైతాంగ సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌. సీత, పంజాల మురళి, గూడెం నరేశ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...