వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌లో గురువారం కార్మికులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన, కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ మాట్లాడారు.
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, నిద్రలేమి,ఆందోళనను నిర్లక్ష్యం చేయవద్దని, సమస్యలు కొనసాగితే నిపుణుల సలహా తీసుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

