వార్తలకు తిరిగి వెళ్లండి
ములుగు జిల్లా పస్రా–తాడ్వాయి మధ్య అటవీ శాఖ చెక్‌పోస్ట్ సమీపంలో ఇసుక లారీ రెండు వాహనాలను ఢీకొట్టింది. తొలుత CRPF జవాన్లు ప్రయాణిస్తున్న డీసీఎంను ఢీకొనడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు సమాచారం.
అనంతరం ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఓవర్‌స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

