వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాచవరంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ ఘనంగా నిర్వహించారు. గ్రామ సచివాలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధులలో డీపీవో కోటేశ్వరరావు నేతృత్వంలో జరిగింది.
దేశభక్తిని చాటుతూ 'ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం' సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీడీవో విష్ణు చిరంజీవి పిలుపునిచ్చారు. స్కాలర్స్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

