వార్తలకు తిరిగి వెళ్లండి
మంగళగిరి ఆలయ పునరుద్ధరణ పనులకు లోకేశ్ భూమిపూజ

మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఉదయం భూమి పూజ చేశారు. దేవాదాయ శాఖకు చెందిన రూ.6.50 కోట్ల నిధులతో ఈ పనులు జరగనున్నాయి.
ఈ ప్రాజెక్టులో భాగంగా యాగశాల, ముఖమండపం, వాహనశాలలను నిర్మించనున్నారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన నమూనా చిత్రాలను ఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు.
Comments
Loading comments...