వార్తలకు తిరిగి వెళ్లండి

భామిని మండలంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ టేకు, మామిడి వంటి భారీ చెట్లను యథేచ్ఛగా నరికేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా పగలు నరికిన కలపను, రాత్రి వేళల్లో బత్తిలి చెక్‌పోస్టు దాటించి మిల్లులకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.
దీంతో పలు గ్రామాల్లో పచ్చదనం కనుమరుగవుతోంది. రైతులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలన తర్వాతే అనుమతులిస్తామని, కలప రవాణాకు అనుమతులు ఇవ్వబోమని తహసీల్దార్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.
Comments
Loading comments...

