Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాకప్‌డెత్‌ కేసు: డీజీపీపై కేసు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 22, 2026 6:47 AM అమరావతిGeneral
లాకప్‌డెత్‌ కేసు: డీజీపీపై కేసు - Udayam
గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విజయవాడ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. సాయికృష్ణ అక్రమ నిర్బంధం, మృతదేహం మాయం వ్యవహారంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు, ఏసీపీ మానసలను నిందితులుగా చేర్చాలని పిటిషన్‌లో కోరారు. భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత సెక్షన్ 210 ప్రకారం నేరంపై ఎవరైనా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఎంపీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...