Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీలో ఓటమి భయం మొదలైంది : సీఎం

Follow Udayam on Google
vihar Sep 01, 2026 2:16 PM అమరావతిGeneral
వైసీపీలో ఓటమి భయం మొదలైంది : సీఎం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీలో ఓటమి భయం మొదలైందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎస్‌ఐఆర్‌ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ అడ్డుపడుతోందని మొగల్తూరు సభలో విమర్శించారు. ఏకగ్రీవాలు జరగొద్దని వైసీపీ కోరుతున్నా.. ప్రజలు కోరుకుంటే ఎవరూ అడ్డుకోలేరన్నారు. మున్సిపాలిటీల్లో పార్టీ మారే నేతలతో ఇబ్బందుల నేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...