వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్రలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Comments
Loading comments...

