వార్తలకు తిరిగి వెళ్లండి
నల్గొండ జిల్లా గండ్లపల్లి మండలం సింగరాజుపల్లి సబ్స్టేషన్ను రైతులు ముట్టడించారు. విద్యుత్ కోతలకు నిరసనగా నల్గొండ–దేవరకొండ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
విద్యుత్ సరఫరా సరిగా లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

