వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రుతాండ గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మణ్ తాండను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని తాండవాసులు సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుతో స్థానిక సమస్యల పరిష్కారానికి, గ్రామాభివృద్ధికి అవకాశం కలుగుతుందని తెలిపారు.
తమ విజ్ఞప్తిని పరిశీలించి, తాండ అభివృద్ధికి సహకరించాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

