వార్తలకు తిరిగి వెళ్లండి

దామరకుంట పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి భవనం లేక విద్యార్థులు చెట్ల కిందే చదువుకుంటున్నారు. రైతువేదికలో గది కేటాయించినా సౌకర్యాలు లేక ఆరుబయటే తరగతులు నిర్వహిస్తున్నారు.
భవన నిర్మాణానికి రూ.16 లక్షలు మంజూరై ముగ్గు పోసి పనులు నిలిచిపోయాయని గ్రామస్థులు తెలిపారు. నిధుల కొరతతో కాంట్రాక్టర్ పనులు చేపట్టడం లేదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

