వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్ పోతే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ సూచించారు. పాతకొమ్ముగూడెంకు చెందిన సురం సునీత మొబైల్ ఫోన్ లక్షెట్టిపేట బస్టాండ్ ప్రాంతంలో పోయింది. ఆమె ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ CEIR పోర్టల్ ద్వారా మొబైల్‌ను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు.
శనివారం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి అన్నకు మొబైల్ ఫోన్‌ను అప్పగించామని ఎస్ఐ వివరించారు.
Comments
Loading comments...

