Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేటలో నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన

Follow Udayam on Google
p.g.murthy Aug 17, 2026 10:37 PM మంచిర్యాలGeneral
లక్షెట్టిపేటలో నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన - Udayam
నానో యూరియా వాడకంతో రైతులకు మేలు జరుగుతుందని లక్షెట్టిపేట ఏవో శ్రీకాంత్ అన్నారు. సోమవారం మండలంలోని జెండా వెంకటాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలలో ఆత్మ పథకం క్రింద క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించి రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. నానో యూరియా స్వయంగా స్ప్రే చేయించడం, ఎరువు ప్రయోజనాలు, ఉపయోగించే విధానం, ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు సౌజన్య, గోవర్ధన్, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...