వార్తలకు తిరిగి వెళ్లండి
లైసెన్స్ కావాలా? ఇక ఆన్‌లైన్ క్లాస్ తప్పనిసరి

డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను రవాణా శాఖ కఠినతరం చేసింది. ఇకపై లెర్నింగ్ లైసెన్స్ పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రోడ్డు భద్రతపై మూడు గంటల వీడియో పాఠాలు చూడటం తప్పనిసరి. ఈ పాఠాలు విన్న వారిని మాత్రమే తదుపరి డ్రైవింగ్ ట్రాక్ టెస్టులకు అనుమతిస్తారు.
కూకట్‌పల్లి కార్యాలయంలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ విధానంలో అభ్యర్థుల ముఖకవళికల నమోదు (ఫేస్ రికగ్నిషన్) ఆధారంగా హాజరును లెక్కిస్తారు.
Comments
Loading comments...