Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లీఫ్ కార్వింగ్‌తో తల్లిపాలపై అవగాహన

Follow Udayam on Google
రాజిత దేవి Aug 04, 2026 5:37 PM కాకినాడGeneral
లీఫ్ కార్వింగ్‌తో తల్లిపాలపై అవగాహన - Udayam
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గొల్లప్రోలు మండలం చెందుర్తి జెడ్పీహెచ్‌ఎస్‌లో వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లి గోవిందరాజులు రావి ఆకుపై లీఫ్ కార్వింగ్ ద్వారా శిశువుకు పాలు ఇస్తున్న తల్లి రూపాన్ని చెక్కి విద్యార్థులను ఆకట్టుకున్నారు. పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం అవసరమని, రోగనిరోధక శక్తి పెంపునకు తల్లిపాలు కీలకమని విద్యార్థులకు వివరించారు.

Comments

G
Loading comments...