వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదల బాధల్లో భాగస్వామ్యమై, ఆపద సమయంలో కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 54 మంది లబ్ధిదారులకు రూ.74 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తమ ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా పేదలకు వైద్య, ఆర్థిక సాయం అందిస్తూ ఆదుకుంటోందని తెలిపారు.
Comments
Loading comments...

