Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో సిటీ బస్సుల ప్రారంభం

Follow Udayam Digital on Google
లక్ష్మి దేవి Jul 30, 2026 5:26 PM కరీంనగర్తెలంగాణ
కరీంనగర్‌లో సిటీ బస్సుల ప్రారంభం - Udayam Digital
కరీంనగర్ నగరవాసులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు లోకల్ సిటీ బస్సు సేవలను ప్రారంభించారు. ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకున్నారు. సిటీ బస్సుల ప్రారంభంతో నగరంలో కనెక్టివిటీ మెరుగుపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రజలకు రవాణా ఇబ్బందులు తగ్గనున్నాయని పేర్కొంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...