Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూలో విరిగిపడిన కొండచరియలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 04, 2026 11:14 AM జాతీయంGeneral
జమ్మూలో విరిగిపడిన కొండచరియలు - Udayam
జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కౌఘా సమీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రామ్‌నగర్-ఉధంపూర్ ప్రధాన రహదారి పూర్తిగా మూతపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రహదారిపై పేరుకుపోయిన భారీ బండరాళ్లను, మట్టిని తొలగించేందుకు జేసీబీ యంత్రాలను రంగంలోకి దించామని, గంటలో ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తామని స్థానిక కాంట్రాక్టర్ పుష్పిందర్ సింగ్ తెలిపారు.

Comments

G
Loading comments...