వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు మండలం మొండితోగు చెరువుకట్ట ప్రాంతానికి చెందిన నవీన ఫిర్యాదుతో బండి వెంకటేశ్వర్లుపై పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడి, అడ్డుకోగా కులం పేరుతో దూషించాడని ఆమె ఈ నెల 9న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేశారు. డీఎస్పీ వెంకన్నబాబు బుధవారం ఘటనాస్థలంలో విచారణ జరిపి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.
Comments
Loading comments...

