Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

Follow Udayam on Google
RAGHU Aug 02, 2026 7:11 PM శ్రీకాకుళంGeneral
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం - Udayam
కొత్తూరు మండలం పారాపురం–బత్తిలి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గురండి గ్రామానికి చెందిన అలికాన ప్రసాద్ (27) మృతి చెందాడు. బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...