Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ ఢీకొని సుమారు 50 గొర్రెలు మృత్యువాత

Follow Udayam on Google
K. Anuradha Oct 03, 2026 9:18 AM శ్రీకాకుళంGeneral
లారీ ఢీకొని సుమారు 50 గొర్రెలు మృత్యువాత - Udayam
పలాస మండలంలోని కంబిరిగాం గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 50 గొర్రెలు మృతి చెందాయి. కాపరులు గొర్రెల మందను రోడ్డు దాటిస్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు కాగా, గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఘటనతో కాపరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...