Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్

Follow Udayam on Google
Ganga Sep 27, 2026 5:04 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్ - Udayam
కురుపాం వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న శోభలతాదేవి కాలనీలో విద్యుత్ పోల్పై సరఫరా వైర్ ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు తెగిపడుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇదే ప్రాంతంలో పిల్లలు అధికంగా తిరుగుతూ ఆడుకోవడంతో ప్రమాదం పొంచి ఉందని వారు చెబుతున్నారు. సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...