Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌతాఫ్రికాలో కాల్పుల కలకలం.. 27 మంది మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 27, 2026 5:25 PM అంతర్జాతీయంGeneral
సౌతాఫ్రికాలో కాల్పుల కలకలం.. 27 మంది మృతి - Udayam
సౌతాఫ్రికాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో సాయుధ దుండగులు కాల్పులకు తెగబడటంతో 27 మంది మృతి చెందారు. జొహెన్నెస్‌బర్గ్‌లోని ఓ బార్‌లోకి చొరబడిన దుండగులు కాల్పులు జరపడంతో 17 మంది చనిపోగా, 15 మంది గాయపడ్డారు. మరో ఘటనలో కేప్‌టౌన్‌ సమీపంలో జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. దాడులకు కారణం తెలియరాలేదు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...