Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాంబారులో బల్లి.. 19 మంది విద్యార్థినులకు అస్వస్థత

Follow Udayam on Google
Udayam Desk Sep 27, 2026 5:16 PM కాకినాడGeneral
కాకినాడ జిల్లా తుని ఉమెన్స్ కాలేజీలో కలకలం రేగింది. మధ్యాహ్న భోజనంలో బల్లి పడిన సాంబారును వడ్డించడంతో 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తుని ఏరియా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. భోజనం చేసిన అనంతరం వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడిన విద్యార్థినులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాంబారులో బల్లి పడినా అలాగే వడ్డించారని విద్యార్థినులు తెలిపారు.

Comments

G
Loading comments...