Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులమతాలకు అతీతంగా పొలాల పండుగ

Follow Udayam on Google
md jabeer Sep 10, 2026 7:41 PM నిర్మల్General
కులమతాలకు అతీతంగా పొలాల పండుగ  - Udayam
నర్సాపూర్ జి మండలంలోని దర్యాపూర్ గ్రామంలో ఎడ్ల పొలాల పండుగ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా, ఇదే గ్రామానికి చెందిన రైతు మహమ్మద్ వసీం తన మూడు ఎకరాల భూమిలో సాగు చేస్తూ... వ్యవసాయానికి కులమతాలతో సంబంధం లేదని చాటుకున్నారు. పొలాల అమావాస్య సందర్భంగా ఆయన తన ఎడ్లను ఎంతో అందంగా అలంకరించి, తన కొడుకు మహమ్మద్ అయాన్‌తో కలిసి గ్రామస్తుల ఎడ్ల ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...