వార్తలకు తిరిగి వెళ్లండి
కూకట్‌పల్లి రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి బైక్‌పై క్రికెట్ ఆడేందుకు వెళ్తున్న మైనర్లను లారీ ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో మహేశ్ (17), లక్ష్మీ తేజ్ (17) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...